Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత క్రికెట్ కోరితే.. నేను సిద్ధమే: అనురాగ్ ఠాకూర్

భారత క్రికెట్ కోసం తాను ఏమి చేయడానికైనా సిద్ధమేనని... బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయనని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నారు. భారత క్రికెట్ కు తన అవసరం ఉందని కోరితే బాధ్యతలను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. అనురాగ్ మళ్లీ భారత క్రికెట్లోకి రావాలని... ఆయన అవసరం భారత క్రికెట్ కు ఉందని ఇటీవలే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, అనురాగ్ ఠాకూర్ తన స్పందనను వ్యక్తపరిచారు. లోథా కమిటీ సిఫారసులను అమలు చేయకుండా, నాన్చుడు ధోరణిని అవలంబించిన నేపథ్యంలో అనురాగ్ పై సుప్రీంకోర్టు వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టుకు నేరుగా హాజరైన అనురాగ్... కోర్టు ఉల్లంఘనకు సంబంధించి క్షమాపణలు తెలిపారు. దీంతో, కేసు నుంచి ఆయన విముక్తి పొందారు.

More Telugu News